భారతదేశం, ఆగస్టు 25 -- తమిళ సినీ ఇండస్ట్రీలో దిగ్గజంగా ఎదిగారు కెప్టెన్ విజయకాంత్. ఇవాళ (ఆగస్టు 25) ఆయన జయంతి. 1952 ఆగస్టు 25న పుట్టారు విజయకాంత్. 2023 డిసెంబర్ 28న చనిపోయారు. తన సుదీర్ఘ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ రోల్స్ కూడా ప్లే చేశారు. తెలుగులోనూ మెరిశారు. రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన కెరీర్ లోని బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్లు ఏ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.

విజయకాంత్ కెరీర్ లోనే ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ 'రమణ'. ఎన్ని ఏళ్లు గడిచినా గుర్తుండిపోయే మూవీ ఇది. ఈ సినిమా విజయకాంత్ ను డిఫరెంట్ గా చూపించింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో 2002లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో అదరగొట్టింది. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.

విజయకాంత్ కు కెప్టెన్ అనే బిరుదు తెచ్చిన మూవీ 'కెప్టెన్ ప్రభాకరన్'. యాక్షన్ ఫ్యాన్స్ తప్పకుండ...