భారతదేశం, జూలై 8 -- తమిళనాడులో మంగళవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుద్దలూరులో ట్రాక్​ దాటుతుండగా ఒక స్కూల్​ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి.

మంగళవారం ఉదయం 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుద్దలూరు- అలప్పక్కమ్​ మధ్యలో ఉన్న రైల్వే క్రాసింగ్​ని స్కూల్​ బస్సు దాటుతుండగా వేగంగా రైలు వచ్చి ఢీకొట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.

తాజా ఘటన నేపథ్యంలో రైల్వే క్రాసింగ్​ల వద్ద భద్రత మరోమారు చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రమాదం కారణంగా స్కూల్​ బస్సు ముందు భాగంగా భారీగా దెబ్బతింది! ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

తమిళనాడు స్కూల్​ బస్సు ప్రమాదంపై మరిన్ని వ...