భారతదేశం, జనవరి 20 -- ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఇవాళ (జనవరి 20) డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉన్న ఈ మూవీనే 'ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ'. రొమాన్స్, ఫాంటసీతో కూడిన ఈ మూవీని తప్పకుండా చూడాలనే కామెంట్లు వస్తున్నాయి.

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ స్టోరీలతో, డిఫరెంట్ జోనర్ సినిమాలు వస్తాయి. అలాంటి ఓ విభిన్నమైన కథతో వచ్చిన చిత్రమే ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ. మంగళవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ మూవీ. ఈ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జనవరి 20, 2026 నుంచి...