భారతదేశం, జనవరి 23 -- ఇండియా, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించడం వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని టీమిండియా మాజీ పేసర్ మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

గ్రూప్-సి మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చకపోతే టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఛైర్మన్ అమీనుల్ ఇస్లాం గురువారం (జనవరి 22) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మదన్ లాల్ స్పందిస్తూ.. "ఇది చాలా మూర్ఖపు నిర్ణయం. దీనివల్ల భారత్‌కు పోయేదేమీ లేదు. నష్టపోయేది బంగ్లాదేశే. ఆర్థికంగా కూడా వారికి ఇది పెద్ద దెబ్బ. నాకు తెలిసి పాకిస్థాన్ వాళ్లను రెచ్చగొడుతోంది. కేవలం భారత్‌ను ఇబ్బంది ప...