భారతదేశం, జనవరి 21 -- కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1.. గతేడాది ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటి. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పటికే మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కోసం సిద్ధమైంది.

తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. థియేటర్​, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్​ మూవీ కాంతార: ఎ లెజెండ్​ ఛాప్టర్​ 1. కన్నడ స్టార్​ హీరో రిషబ్​ శెట్టి స్వీయ​ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్​ నిర్మించిన ఈ సినిమాను వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా అందిస్తోంది జీ తెలుగు. రిషబ్​ శెట్టి​, రుక్మిణీ వసంత్​ నటించిన బ్లాకబస్టర్​ మూవీ కాంతార: ఎ లెజెండ్​ చాప్టర్​ 1.. ఈ శనివారం (...