భారతదేశం, ఫిబ్రవరి 25 -- సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మధ్య ఏ సినిమాను అయినా ఒకేసారి అటు ఓటీటీ, ఇటు టీవీలోకి తీసుకొస్తున్న జీ నెట్‌వర్క్ ఈ మన శంకరవరప్రసాద్ గారు విషయంలో మాత్రం ఓటీటీ ప్రీమియర్ తర్వాత కాస్త ఆలస్యంగా టీవీలోకి తెస్తోంది.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. థియేటర్లలోనే కాదు జీ5 ఓటీటీలోనూ రికార్డుల దుమ్ము దులిపింది. ఇప్పుడీ 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ జీ తెలుగు (Zee Telugu) ఛానెల్‌లో ఈ శనివారం అంటే ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇప్పటి వరకూ థియేటర్లలో, ...