భారతదేశం, నవంబర్ 8 -- మీ ఆర్థిక లక్ష్యాలను మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా సాధించాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్​) మంచి ఆప్షన్​ అవుతుంది. సిప్​ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీ కెరీర్ ప్రారంభంలో మీరు పెట్టే పెట్టుబడి కాలక్రమేణా భారీగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే, మొదటి కొన్ని సంవత్సరాల్లో వచ్చే రాబడి.. తర్వాతి సంవత్సరాల్లో అసలుగా మారుతుంది. దీనివల్ల తర్వాత సంవత్సరాల్లో మీ పెట్టుబడి మరింత వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. మీ లక్ష్యాలు ఖచ్చితంగా ఫిక్స్​ చేసుకోవడం. ఉదాహరణకు, 2040 నాటికి, అంటే ఇప్పటి నుంచి 15 ఏళ్లలో, మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు రూ. 1 కోటి అవసరం అవుతుందని మీరు భావిస్తే, దానికి అనుగుణంగా మీ ప...