భారతదేశం, ఆగస్టు 12 -- టాప్ అప్ లోన్ అంటే మీ ప్రస్తుత రుణంపై ఇచ్చే అదనపు రుణం. అంటే ఉన్న రుణం అలాగే కంటిన్యూ అవుతుంది.. మీద నుంచి అదనంగా లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఉన్న గృహ రుణ కస్టమర్లకు అందిస్తాయి. ఇది మీ గృహ రుణ బ్యాలెన్స్, ఆస్తి ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా ఆమోదం పొందుతుంది. మీకు ఎంత టాప్ అప్ హోమ్ లోన్ లభిస్తుందనేది మీ ఆస్తి మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. టాప్ అప్ హోమ్ లోన్ పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తుంది. ఎక్కువ కాలం పాటు పొందవచ్చు.

టాప్ అప్ హోమ్ లోన్ అర్హతలు బ్యాంకు, ఆర్థిక సంస్థలను బట్టి మారవచ్చు. సాధారణ అర్హతలు కొన్ని ఉంటాయి. టాప్ అప్ హోమ్ లోన్ పొందడానికి, మీకు ఇప్పటికే హోమ్ లోన్ ఉండాలి. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీరు హోమ్ లోన్ ఈఎంఐని సకాలంలో చ...