భారతదేశం, జూలై 6 -- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలులో బ్యాటరీ లైఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. కాల్స్ చేసుకోవాలన్నా, నావిగేషన్ ఉపయోగించాలన్నా, చెల్లింపులు చేయాలన్నా, పని లేదా వినోదం కోసం అయినా, వినియోగదారులు రోజంతా తమ ఫోన్‌లపై ఆధారపడుతున్నారు. పెద్ద బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్ ముఖ్యమైన సమయాల్లో ఛార్జింగ్ అయిపోతుందనే ఆందోళనను తగ్గిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అవసరమైనప్పుడు త్వరగా పవర్‌ను తిరిగి నింపడం ద్వారా మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.

లాంగ్​ లాస్టింగ్​ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్రస్తుతం జులై 2025 నాటికి భారతదేశంలో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా ఇక్కడ చూసేయండి..

రియల్‌మీ GT 7 డ్రీమ్ ఎడిషన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఈ విభాగంలోనే అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తు...