భారతదేశం, జూలై 5 -- ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టిన టాటా హారియర్​ ఈవీని బుక్​ చేసుకుని, డెలివరీ కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! టాటా మోటార్స్​కి చెందిన ఈ సరికొత్త లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ కారు ప్రొడక్షన్​ మహారాష్ట్రలోని పుణె ప్లాంట్‌లో ప్రారంభమైంది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఈ కొత్త మోడల్​ ఒక కీలకంగా నిలవనుంది. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ. 21.49 లక్షల నుంచి రూ. 30.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కొత్త హారియర్ ఈవీకి మార్కెట్ నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, బుకింగ్‌లు భారీగా ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. త్వరలోనే డీలర్‌షిప్‌లకు ఈ వాహనం చేరుకుంటుందని, ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభం అవుతాయని సమాచారం!

కొత్త టాటా హారియర్ ఈవీ acti.ev+ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెర్షన్ ప్లాట్...