Hyderabad, జూలై 22 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. ఇలా సంచరించినప్పుడు, శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే, ఈ యోగాల ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

జూలై 28న ఒక అశుభ యోగం ఏర్పడనుంది. ఆరోజు కుజుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఇలా ఉంటే, శని మీన రాశిలో ఉన్నాడు. దీంతో సంసప్తక రాజయోగం ఏర్పడుతుంది.

కుజుడు, శని ఎదురెదురుగా రావడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి. మరి ఏ రాశుల వారికి ఈ రాజయోగం వల్ల ఇబ్బందులు వస్తాయి అనేది తెలుసుకుందాం.

ఈ అశుభ రాజయోగం కర్కాటక రాశి వారికి సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్నచిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉ...