Hyderabad, జూలై 22 -- మాస శివరాత్రి నాడు శివుడుని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. ఆ రోజు శివుడిని ఆరాధించడం వలన శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు, ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే, ఈసారి వచ్చే మాస శివరాత్రి నాడు ఆరుద్ర నక్షత్రం ఉండటంతో ఇది మరింత ప్రత్యేకం. జూలై 23న మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రావడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.

ఆ రోజు శివుడిని భక్తితో ఆరాధిస్తే సంతోషంగా ఉండవచ్చు, కష్టాలు, సమస్యలు అన్ని తీరిపోతాయి. ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం, మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఉండడం చాలా అరుదైనది, విశేషమైనది. కనుక తప్పకుండా జూలై 23న శివుడిని ప్రత్యేకించి ఆరాధించడం మంచిది.

పంచాంగం ప్రకారం, ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని అంటారు. ఆ రోజున ప్రత్యేకించి శివుడిన...