భారతదేశం, జూలై 12 -- జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. లగ్జరీ, ప్రేమ, అందం, సంపద, సౌకర్యాలు మరియు భౌతిక సుఖాలకు శుక్రుడిని కారకుడిగా జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. నవగ్రహాలలో శుభ గ్రహంగా పేరున్న శుక్రుడు ఎప్పుడు రాశి మారినా లేదా నక్షత్ర సంచారం చేసినా.. ఆ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 2026 జూలై 16న ఒక కీలకమైన నక్షత్ర మార్పు జరగబోతోంది.

జూలై 16న శుక్రుడు 'పూర్వ ఫాల్గుణి' నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య పరిభాషలో పూర్వ ఫాల్గుణి నక్షత్రానికి అధిపతి స్వయంగా శుక్రుడే. తన సొంత నక్షత్రంలోకే శుక్రుడు రావడం వల్ల ఈ సంచారానికి ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సానుకూల మార్పు వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్...