Hyderabad, జూన్ 24 -- వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు గత నెలలో కుజుడు రాశి అయినటువంటి మేష రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 29 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడంతో ధన శక్తి రాజయోగం జూన్ 29 వరకు ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది.

జూన్ 29 మధ్యాహ్నం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధన శక్తి రాజయోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

వృశ్చిక రాశి వారికి ధన శక్తి యోగం అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ధన శక్తి రాజయోగం సంపద ద్వారాలను తెరుస్తుంది. జూన్ 29 వరకు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెండింగ్‌లో ఉన్న పన...