భారతదేశం, మే 17 -- శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని, అక్కడికక్కడే పరిష్కారాల కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒక కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణాన్ని పురస్కరించుకుని, అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న జూన్ 12వ తేదీ నుండి ఈ కొత్త పింఛన్ల పంప...