Hyderabad, సెప్టెంబర్ 16 -- జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒకే రోజు రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకటి అతడు జిమ్ లో వర్కౌట్ చేస్తూ స్లిమ్ లుక్ లో కనిపించగా.. మరోవైపు మంగళవారం (సెప్టెంబర్ 16) అమెరికా కాన్సులేట్ లోనూ అతడు కనిపించడం విశేషం. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే తారక్ ఇలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యే వార్ 2 మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ లో అతడు బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే అతడు పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో అతడు చాలా సన్నగా కనిపించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో బొ...