భారతదేశం, జూలై 29 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 572 పాయింట్లు పడి 80,891 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 156 పాయింట్లు పడి 24,680 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 444 పాయింట్లు పడి 56,085 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5876.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,599.19 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 24,800 లెవల్స్​ కింద ట్రేడ్​ అవుతున్నంత కాలం సెంటిమెంట్​ వీక్​గా ఉన్నట్టు. 24,550-24,500 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. 24,800 బ్రేక...