Hyderabad, ఆగస్టు 30 -- ఆకట్టుకునే సీరియల్స్, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఈ వినాయక చవితికి ప్రేక్షకులకు మరింత వినోదం పంచనుంది. మరో ప్రత్యేక కార్యక్రమంతో జీ తెలుగు తన బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
భక్తి, వినోదం కలగలసిన జీ తెలుగు అందిస్తున్న గణేష్ చతుర్థి సంబరం గం గం గణేశా. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన గం గం గణేశా ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 31న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. యాంకర్ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ సదా, హీరో మంచు మనోజ్ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఇలా నటీనటుల గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.