భారతదేశం, సెప్టెంబర్ 6 -- సమస్య రాక ముందే అప్రమత్తం కావడం, అంకితభావంతో పనిచేయడమే విజయానికి అసలైన బాట అని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు. జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అయితే కొందరు ఎంత కష్టపడినా నిరాశే మిగులుతుంది. దీనికి కారణం మనలోని కొన్ని అలవాట్లేనని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. మనిషి విజయానికి అతడి ప్రవర్తనే అతిపెద్ద అడ్డంకిగా మారుతుందని చాణక్య హెచ్చరించారు.

ఓ శ్లోకం ద్వారా చాణక్య అత్యంత కీలకమైన జీవన సత్యాన్ని వివరించారు. భవిష్యత్తులో రాబోయే ఆపదను ముందుగానే ఊహించి తగిన ముందస్తు చర్యలు తీసుకునేవారు, అలాగే ఆపద వచ్చిన క్షణంలోనే తన బుద్ధితో తక్షణ నిర్ణయాలు తీసుకునేవారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడి "జరిగింది...