Hyderabad, జూలై 18 -- హిమ్మత్ సింగ్‌గా కేకే మీనన్ తిరిగి వస్తాడని తెలిసి 'స్పెషల్ ఆప్స్ 2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కరణ్ టాకర్, గౌతమి కపూర్, ముజామిల్ ఇబ్రహీం నటించిన ఈ సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్‌లు శుక్రవారం (జులై 18) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేశాయి. మరి ఈ షో అంచనాలను అందుకుందా? ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటివరకు ఈ సిరీస్‌ను చూసిన చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా ఖాతాల్లో తమ రివ్యూలు ఇస్తున్నారు. చాలా వరకు పాజిటివ్ రివ్యూలే రావడం విశేషం.

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిజానికి గత వారామే రావాల్సి ఉన్నా.. షోలో ఓ కీలకమైన డైలాగ్ మార్చడంతో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (జులై 18) రిలీజైంది. ఈ సిరీస్ ను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పా...