భారతదేశం, అక్టోబర్ 6 -- వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' సినిమా ప్రియుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1తో పోటీ పడుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1, సన్నీ సంస్కారి కి తులసి కుమారి రిలీజైన సంగతి తెలిసిందే.

జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ విడుదలై 4 రోజులు పూర్తయ్యింది. హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అదర్ పూనావల్లా, శశాంక్ ఖైతాన్ ధర్మ ప్రొడక్షన్స్, మెంటర్ డిసైపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీని బడ్జెట్ రూ. 31.14 కోట్లు. మొదటి వారం వసూళ్లను పెంచడానికి మేకర్స్ బై 1 గెట్ 1 టికెట్ ఆఫర్ పెట్ట...