Hyderabad, ఆగస్టు 29 -- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రీసెంట్ గా ఒక తెలియని విషయం చెప్పింది. ఆమెకు తరచుగా బయట.. ముఖ్యంగా ఇండియాలో లేనప్పుడు కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతుంటాయని వెల్లడించింది. అలాంటి వాటిని తప్పించుకోవడానికి తనకు పెళ్లయినట్లుగా ఆమె చెబుతుందట. ఒకసారి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓర్హాన్ అవత్రామణి అలియాస్ ఓర్రీని తన భర్తగా పరిచయం చేశానని కూడా చెప్పడం విశేషం.

జాన్వీ కపూర్ ఐఎండీబీ ఒరిజినల్ సిరీస్ అయిన 'స్పీడ్ డేటింగ్'లో తన 'పరమ్ సుందరి' కోస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పాల్గొంది. ఇందులో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. ప్రేమ, ఫస్ట్ డేట్స్ పై తన అభిప్రాయాలను పంచుకుంది. విదేశాల్లో ఫ్లర్టింగ్ ను తప్పించుకోవడానికి తాను ఒకసారి ఓర్రీని తన భర్తగా చెప్పుకోవాల్సి వచ్చిందని కూడా జాన్వీ వెల్...