భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ అప్డేట్ వివరాలు ఇక్కడ చూడండి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. 'పుష్ప' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. తన నెక్ట్స్ సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అట్లీ కుమార్ తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన ...