Hyderabad, జూన్ 23 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

"కుబేర సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్‌గా పర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్‌గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది" అని చిరంజీవి అన్నారు.

"కుబేర సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది మూవీలో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్‌ని ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క...