భారతదేశం, సెప్టెంబర్ 27 -- జనావర్ రివ్యూ

తారాగణం: భువన్ అరోరా, వినోద్ సూర్యవంశీ, బద్రుల్ ఇస్లాం, అతుల్ కాలే, భగవాన్ తివారీ, ఎషికా డే, వైభవ్ యశ్వీర్, దీక్షా సోనాల్కర్ థామ్, నీతి కౌశిక్

దర్శకత్వం: సచీంద్ర వాట్స్

రేటింగ్: 2.5/5

జీ5 ఓటీటీలోకి కొత్త సిరీస్ వచ్చేసింది. హిందీ క్రైమ్ థ్రిల్లర్ 'జనావర్ ది బీస్ట్ వితిన్' సిరీస్ నిన్న (సెప్టెంబర్ 26) డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అడుగుపెట్టింది. తలలు లేని మొండెం, గోల్డ్ రాబరీ, మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది ఈ వెబ్ సిరీస్. ఇందులో ఓ బలమైన సందేశం కూడా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో కుల వివక్షను కళ్లకు కట్టినట్లు చూపించారు.

జీ5 లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ 'జనావర్'. ఇది ఓ పోలీస్ సిస్టమ్ కు సంబంధించిన డ్రామా స్టోరీ. ఇది కుల వివక్షను సున్నితమైన పద్ధతిలో ప్రశ్నిస్తుంది. 'ఒక వ్యక్తి సమా...