భారతదేశం, మార్చి 5 -- ఎక్కడైనా హోలీ అంటే రంగులు చల్లుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో బావాబావమరుదులు పార్టీలు చేసుకుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సీన్ వేరేగా ఉంటుంది. పురుషులు చీర కట్టుకుని.. హోలీ చేసుకుంటారు. వాళ్లు రెడీ అయిన తీరు చూస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. గడ్డం ఉన్న ముఖాలకు పౌడర్, లిప్‌స్టిక్ పెట్టుకుంటారు. ఆ ఊరే కర్నూరు జిల్లాలోని ఆదోని మండలంలో ఉన్న సంతేకూడ్లురు గ్రామం. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఈ ఊరు ఉంటుంది.

అయితే హోలీ రోజున ఈ ఆచారం వెనక ఓ కథ కూడా ఉంది. దానిని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే ప్రతీ ఏటా చీరకట్టులో పురుషులు సింగారించుకుంటారు. ఆ కథ ఏంటంటే.. ఒకప్పుడు కర్నూలులోని సంతేకూడ్లురు గ్రామం ప్రాంతంలో కరువు ఎక్కువైందట. గ్రామస్థులు అంతా కలిసి శ్రీకృష్ణుడి...