భారతదేశం, జూలై 27 -- భారత దేశంలో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్​ కార్లలో ఎంజీ కామెట్​ ఈవీ ఒకటి. ఇక ఇప్పుడు, ఈ ఈవీ ధరలను జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ పెంచింది. వేరియంట్​ను బట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ. 15,000 వరకు పెరిగింది. మే 2025లో బ్రాండ్ విధించిన మునుపటి ధరల పెంపు తర్వాత ఇది రెండోసారి. ఈ ధరల పెంపుతో పాటు కంపెనీ బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ అద్దె ధరలు కూడా ప్రభావితం కానున్నాయి.

ఎక్స్-షోరూమ్ ధరల పెంపుతో పాటు జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ తమ BaaS సబ్‌స్క్రిప్షన్ రుసుమును కిలోమీటర్‌కు రూ. 2.90 నుంచి రూ. 3.10కి పెంచింది. ఈ పెంపు చిన్నదిగా కనిపించినా.. ప్రతి 1,000 కి.మీ.కు అదనంగా రూ. 200 భారం పడుతుంది. తరచుగా వాహనం వాడే వారికి ఇది కాలక్రమేణా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వాహనం నిర్వహణ ఖర్చుపై ప్ర...