భారతదేశం, నవంబర్ 21 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
ఇటీవలే చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ. ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదిలా ఉండగానే.. తాజాగా చేవెళ్ల పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
Published by ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.