భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం (నవంబర్ 3) జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది మరణించారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి కూడా ఉండడం తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపగా.. కొన్ని సినిమాల నుంచి రావాల్సిన అప్డేట్లు వాయిదా పడ్డాయి.

చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో, పలువురు ప్రముఖులు, ప్రజలు సోషల్ మీడియాలో మృతులకు సంతాపం తెలిపారు. ఇదే సమయంలో, టాలీవుడ్ స్టార్ హీరోలు నాగ చైతన్య (కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న 'NC24' టీమ్), బాలకృష్ణ (గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'NBK111' టీమ్) తమ సినిమా తాలూకు ప్రకటనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

"చేవెళ్లలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనతో ప...