భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఈ వారం కూడా ఓటీటీలోకి తమిళ సినిమాలు దూసుకొచ్చాయి. ఇందులో కొన్ని థ్రిల్లర్లు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్, హారర్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి. ఈ వారం వచ్చిన తమిళ సినిమాల్లో ఓటీటీలోని టాప్ మూవీస్ ఏంటో ఓ సార చూసేద్దాం.

హౌస్ మేట్స్ అనేది ఒక సూపర్ నేచురల్ హారర్ కామెడీ థ్రిల్లర్. ఇందులో కొత్తగా పెళ్లయిన దంపతులు కొత్త ఇంట్లోకి మారతారు. కానీ ఆ ఇల్లు దెయ్యాలతో నిండి ఉందని తెలుసుకుంటారు. ఆ తర్వాత అక్కడ మిస్టరీ ఇన్సిడెంట్లు జరుగుతాయి. రహస్య సంఘటనలు, దెయ్యాలతో వాళ్ల సంబంధం తదితర విషయాలతో మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో దర్శన్, అర్ష చంద్ని బైజు, కాళి వెంకట్, వినోధిని వైద్యనాథన్ తదితరులు నటించారు. ఇది ఓటీటీలో సెప్టెంబర్ 19న వచ్చింది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది...