భారతదేశం, జనవరి 4 -- ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బయటకు వెళ్లడమే గగనంగా మారింది. హీరో లేదా హీరోయిన్ పబ్లిక్ లో కనిపిస్తే జనాలు ఎగబడిపోతున్నారు. చుట్టుముట్టి, మీద పడిపోతూ తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ కేఫ్ లోకి తన భార్యతో వెళ్లిన అల్లు అర్జున్ అతి కష్టం మీద బయట పడ్డాడు.
శనివారం (జనవరి 3) రాత్రి హైదరాబాద్‌లోని కేఫ్ నీలోఫర్ వద్ద అభిమానులు అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డిలను చుట్టుముట్టడం కలకలం రేపింది. నగరంలో అల్లు సినిమాస్ ప్రారంభించిన తర్వాత దంపతులు ఈ కేఫ్‌కు వచ్చారు. వెంటనే ఫ్యాన్స్ వాళ్లను గుర్తుపట్టారు. సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు వారి చుట్టూ గుమిగూడారు.
ఫ్యాన్స్ ఎగబడటంతో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి చేతిని గట్టిగా పట్టుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.