Hyderabad, ఆగస్టు 21 -- మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తెలుగు ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభరకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా చేయగా కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించాడు.

అయితే, 2023లో చిరంజీవి బర్త్ డే సందర్భంగా 'మెగా 156'గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో తాజాగా మూవీ టీమ్ దీనిపై స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి టీమ్ ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్)లో షేర్ చేసిన వీడియోలో విశ్వంభర ఆలస్యాన్ని ప్రస్తావించారు.

ఈ సినిమా మొదట 2025 జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. 2026 సమ్మర్‌కు విశ్వంభర సినిమాను విడుదల చేయనున్నట్లు చిరంజీవి ఆ వీడియో తెలిపారు. విశ్వంభర ఆలస్యం, గ్రాఫిక...