Hyderabad, జూలై 13 -- తెలుగు వెండితెర దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఇవాళ (జులై 13) తెల్లవారు జామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచి అనంతలోకాలకు తిరిగిరాకుండా వెళ్లిపోయారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కోట శ్రీనివాసరావు మరణంపై పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాతో ప్రారంభమైన కోట శ్రీనివాసరావు 40 ఏళ్ల నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావుకు చిన్నతనం నుంచే నాటకాల పిచ్చి. ఆ ఇష్టంతోనే వందలాది నాటకాలు వేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు కోట శ్రీనివాసరావు. ఇదే సినిమాతో హీరోగా...