భారతదేశం, ఆగస్టు 22 -- ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్ బోన్ గా మారారు చిరంజీవి. ఒక మాములు మనిషి మెగా స్టార్ కాగలడు అని నిరూపించారు చిరంజీవి. యాక్టింగ్ తో, డ్యాన్స్ తో , ఫైట్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు 70వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆయన అదే ఎనర్జీతో సినిమాల్లో అదరగొడుతున్నారు. ఇవాళ (ఆగస్టు 22) చిరంజీవి బర్త్ డే. ఆయన కెరీర్ లోని టాప్-5 అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

స్వతంత్ర సమర యోధుడు, బ్రిటీష్ వాళ్లపై పోరాట బావుటా ఎగరవేసిన తెలుగు ఉద్యమ కారుడు ఉయ్యలావాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వచ్చిన మూవీ 'సై రా నరసింహా రెడ్డి'. ఈ మూవీకి చిరంజీవి కెరీర్ లో స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిల్మ్ ఇదే. 2019ల...