భారతదేశం, జనవరి 4 -- చికెన్ ధరలు కొండెక్కాయి. డిసెంబర్ నుంచి క్రమంగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. న్యూఇయర్ వేళ కూడా ఇదే మాదిరి ధరలు ఉండగా. తాజాగా మరికొంత పెరిగే దిశగా వెళ్తోంది. చలికాలం ప్రభావం, పెరిగిన డిమాండ్‌తో ఏకంగా కిలో కేజీ రూ. 300కి చేరిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో చికెన్ ధర కొంచెం ఎక్కువగానే ఉంది. ఇవాళ కేజీ (స్కిన్‌ లెస్) చికెన్ ధర ఏకంగా రూ. 300 దాటిపోయింది. కొన్ని ఏరియాలో కిలో కేజీ చికెన్ రూ. 310 వరకు ఉంది. ఈ సీజన్‌లో నమోదైన అత్యధిక ధర ఇదేనని వ్యాపారులు చెబుతున్నారు.

మరోవైపు సంక్రాంతి పండగ కూడా సమీపిస్తోంది. దీనికితోడు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో.ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ మినహాయిస్తే. ఇతర ప్రాంతాల్లో గత వారంలో ఉన్న ధరలే అమల్లో ఉన్నాయి.

ఇతర జిల్లాల్లో కిలో చికెన్ రూ. 300 వరకు పలుకుతోంది. కొ...