భారతదేశం, జూలై 27 -- భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జూలై 23న 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. లండన్‌లో అతనికి సర్ ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ దక్కింది. లండన్ వీధుల్లో విదేశీ భామలు డ్యాన్స్ చేస్తూ చాహల్ కు హ్యాపీ బర్త్ డే అని చెప్పారు. వాళ్ల టీషర్టుల వెనకాల 'హ్యాపీ బర్త్ డే యూజీ' అని ఉంది. ఈ వీడియోను చాహల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ సర్ ప్రైజ్ విషెస్ వెనుక చాహల్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ తో కలిసి తన క్రేజియెస్ట్ పుట్టినరోజును జరుపుకున్నాడు. మహ్వాష్ ను చాహల్ హగ్ చేసుకున్నాడు. విదేశీ భామలు డ్యాన్స్ తో అదరగొట్టారు. మధ్యలో చేరి చాహల్ కూడా డ్యాన్స్ చేశాడు. "హ్యాపీ బర్త్‌డే యూజీ! వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక భాగం. ...