భారతదేశం, అక్టోబర్ 15 -- ఆచార్య చాణక్య నీతులు నాటికాలానికే కాదు, నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిపోతాయి. మనిషి తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదగడానికి చాణక్య విధానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ నీతులను ఆచరించడం కాస్త కష్టంగా అనిపించినా, వాటిని పాటిస్తే మాత్రం జీవితం సజావుగా సాగిపోతుంది. చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ విద్య మరియు జ్ఞానమే అత్యంత గొప్ప సంపద, అలాగే ఎప్పటికీ వీడని నిజమైన మిత్రుడు.

ఓ శ్లోకం ప్రకారం, విద్య అనేది సమస్త కోరికలను తీర్చే కామధేనువు లాంటిది. ఇది సరైన సమయాల్లోనే కాకుండా, ఆపద సమయంలో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనం సొంతూరిని విడిచి పరాయి ప్రాంతాలకు వెళ్లినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిలా మనలను కాపాడేది మనకు వచ్చిన విద్య మరియు జ్ఞానమే. అందుకే దీనిని 'రహస్య ధనం' లేదా...