భారతదేశం, డిసెంబర్ 31 -- నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ, ఇటీవలి మీడియా సమావేశంలో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తో తనకున్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు, భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సూర్యకుమార్ గతంలో తనకు తరచుగా మెసేజ్ చేసేవాడని ఖుషీ ఆరోపించింది.

భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది ఖుషీ ముఖర్జీ. అయితే, వారి మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, తాను క్రికెటర్లతో ఎలాంటి సంబంధాలను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. కిడ్డన్ ఎంటర్టైన్మెంట్ షేర్ చేసిన ఒక వీడియోలో, తన పేరును, క్రీడాకారులను కలిపి ఎలాంటి పుకార్లు రావాలని తాను కోరుకోవడం లేదని తెలిపింది.

"నేను ఏ క్రికెటర్ తోనూ డేటింగ...