భారతదేశం, సెప్టెంబర్ 28 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇవాళ ప్రత్యేకమైన రోజు. 2007లో సెప్టెంబర్ 28నే రామ్ చరణ్ ఫస్ట్ మూవీ 'చిరుత' రిలీజైంది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ రోజు (సెప్టెంబర్ 28)తో 18 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా అతని తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు.

రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్ కంప్లీట్ అయిన నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. చెర్రీని హీరోగా తెరపై చూసిన క్షణం ఎప్పటికీ మరచిపోలేనని ఎక్స్ లో పేర్కొన్నారు చిరంజీవి. పెద్ది మూవీ పోస్టర్ ను రీ షేర్ చేస్తూ చిరు స్పెషల్ కామెంట్లు చేశారు.

''చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం 'చిరుత'తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి...