Hyderabad, ఆగస్టు 2 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు, అశుభ యోగాలు, శుభ యోగాలు రెండూ ఏర్పడుతూ ఉంటాయి. నిన్న చంద్రుడు, శుక్రుడు సంచారంలో మార్పు చోటు చేసుకుంది. ఈ సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. చంద్ర శుక్రుల సంచారంలో మార్పు ఈ రాశుల వారికి అనేక లాభాలను కలిగిస్తుంది. శుక్రుడు సంపదన, ఐశ్వర్యం, విలాసాలకు కారకుడు. చంద్రుడు మనసు, మాటలు, ప్రకృతి, ఆలోచనలకు కారకుడు.

నిన్న చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ రెండు గ్రహాలు నక్షత్ర మార్పు చెందడంతో, కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం బాగుంటుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరూ? వా...