Hyderabad, ఆగస్టు 6 -- స్వీటీ అనుష్క శెట్టి మరో శక్తివంతమైన పాత్రతో ఘాటి మూవీ వస్తోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (ఆగస్ట్ 6) మేకర్స్ రిలీజ్ చేశారు. గంజాయి స్మగ్లర్లుగా మారిన ఘాటీగా అనుష్క కనిపించింది. ఈ ట్రైలర్లో ఆమె పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ మూవీపై అంచనాలు పెంచేసింది.

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ ఘాటి (Ghaati). తనదైన మార్క్ కథలకు ప్రసిద్ధి గాంచిన అతడు ఈసారి అనుష్కతో మరో అద్భుతమే చేసేలా ఉన్నాడు. ఈ ఘాటి ట్రైలర్ మొదట్లోనే అసలు ఆ ఘాటీలు ఎవరన్నది పరిచయం చేశారు. బ్రిటీష్ కాలంలో కొండలు తవ్వి రోడ్లు వేసిన వాళ్లు ఇప్పుడు గంజాయి స్మగర్లుగా, కదిలే కొండలుగా మారారని చెబుతారు. ఆ తర్వాత అనుష్కను ఓ బస్ కండక్టర్ గానూ చూపించడం విశేషం.

అక్కడే ఓ రౌడీ ఆమెను వేధించడం.. నీ పెళ్...