Hyderabad, జూలై 6 -- తెలుగు లెజండరీ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. పౌరాణిక పాత్రలతో ఆయన ఎంతగానో మెప్పించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో యముడి పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆయన తర్వాతే ఎవరైన అనేంతలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి కైకాల సత్యనారాయణ పోషించిన మరో మంచి పౌరాణిక పాత్ర ఘటోత్కచుడు.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఘటోత్కచుడు సినిమాలో కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ పోషించి మెప్పించారు. కథ, కథనాలు, నటీనటుల యాక్టింగ్ పరంగానే కాకుండా ఇందులోని పాటలు కూడా ఎంతగానో హిట్ సాధించాయి. ఘటోత్కచుడుగా కైకాల సత్యనారాయణ నటించిన ఈ సినిమాలో అందాల అపరంజి బొమ్మ ఒక సూపర్ హిట్ సాంగ్.

తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తప్పించుకున్న చిట్టీ అనే పాప అడవిలో తప్పిపోతుంది. పూర్వ జన్మలో తను ఇచ్చిన మాట ప్రకారం పాపను ఆదుకోడానికి వస్తాడు ఘటోత్కచుడు. అప్ప...