భారతదేశం, నవంబర్ 12 -- చికిరి చికిరి.. ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది ఈ పాట. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారుతోంది. ఈ సాంగ్ కు ఫారెనర్లు ముఖ్యంగా విదేశీ అమ్మాయిలు చేస్తున్న డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

పెద్ది మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చికిరి' ఇన్ స్టంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీలోని పాటగా చరిత్ర నమోదు చేసింది. ఈ పెప్పీ మెలోడీలో రామ్ చరణ్ స్టెప్స్ అదిరిపోయాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న పెద్ది మూవీలో నుంచి వచ్చిన చికిరి సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడాడు. ఆ పాట, స్టెప్స్ కలిసి వైరల్ గా మారాయి. ...