భారతదేశం, జూలై 26 -- డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో సిరీస్ లు, సినిమాలు తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఓటీటీ నుంచి మరో సిరీస్ రాబోతోంది. వరుసగా సూపర్ హిట్లు కొడుతున్న ఈటీవీ విన్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రాబోతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (జులై 26) ప్రకటించారు.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈటీవీ విన్ లో ఆగస్టు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ''మీ రెగ్యులర్ పోలీస్ కాదు. మీ రెగ్యులర్ కేసు కాదు. అన్నింటినీ షేక్ చేసేందుకు కానిస్టేబుల్ కనకం రెడీ అయింది. ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. ఆగస్టు 14 నుంచి ప్రీమియర్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ'' అని ఓటీటీ పోస్టు ...