భారతదేశం, ఆగస్టు 28 -- వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాము. వినాయక చవితి నాడు వినాయకుని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వచ్చింది. ఆ రోజు గ్రహాల అరుదైన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

వినాయకుడిని కేతువు గ్రహానికి అధిపతి అంటారు. తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. అయితే వినాయకుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆ రాశులు ఎవరు అనేది ఇప్పుడే చూసేద్దాం.

కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత బాగా కలిసి రాబోతుంది. కన్యా రాశిలో బుధుడు ఉచ్ఛలో ఉండడం వలన తెలివితేటలు పెరుగుతాయి. అలాగే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుం...