భారతదేశం, డిసెంబర్ 20 -- 2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఈ పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలు,జిల్లాల వారీగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్ అధ్యక్షతన జరింగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల సహ్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఇది మొదటి ప్రాథమిక సమావేశం కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో మంతృల బృందాన్ని,కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జి.వీరపాండ్యను ప్రభుత్వం ప్రత్యేక ...