భారతదేశం, జూలై 5 -- రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్​డీఓకి చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్​ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డీఆర్​డీఓ అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్​ చేసుకోవచ్చు. డీఆర్​డీఓ రిక్రూట్​మెంట్​ 2025 ద్వారా సంస్థలో మొత్తం 152 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 18, 2025 అని గుర్తుపెట్టుకోండి. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

డీఆర్‌డీఓలో సైంటిస్ట్ 'బీ': 127 పోస్టులు

ఏడీఏ (ఏడీఏ) లో సైంటిస్ట్/ఇంజినీర్ 'బీ': 9 పోస్టులు

ఎన్‌కాడ్రైడ్ సైంటిస్ట్ 'బీ' పోస్టులు: 16 పోస్టులు

డీఆర్​డీఓ రిక్రూట్​మెంట్​లో పాల్గొనే అర్హులైన అభ్యర్థులను గేట్​(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజన...