భారతదేశం, డిసెంబర్ 16 -- ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ వార్ మూవీగా నిలిచిన 'బోర్డర్' (1997) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బోర్డర్ 2' (Border 2) టీజర్ విడుదలైంది. విజయ్ దివస్ (డిసెంబర్ 16) సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌లో సన్నీ డియోల్ మరోసారి తన పవర్ ప్యాక్డ్ డైలాగ్స్‌తో అదరగొట్టడం చూడొచ్చు. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టిలతో కూడిన ఈ టీజర్ 1971 యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

దేశభక్తి చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బోర్డర్ 2' టీజర్ మంగళవారం (డిసెంబర్ 16) ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయాన్ని గుర్తుచేసుకునే 'విజయ్ దివస్' రోజున మేకర్స్ ఈ టీజర్‌ను వదలడం విశేషం.

బోర్డర్ 2 టీజర్ మొదలవ్వడమే 1971 యుద్ధ దృశ్యాలతో మొదలవుతుంది. సన్నీ డియోల్ వాయిస్ ఓవ...