భారతదేశం, ఆగస్టు 24 -- గూగుల్​ తన కొత్త పిక్సెల్ 10 సిరీస్‌ను ఇండియాలో ఇటీవలే విడుదల చేసింది. ఈ స్మార్ట్​ఫోన్స్​ లేటెస్ట్​ టెన్సార్​ జీ5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్​ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. ఈ సిరీస్‌లో బేసిక్ మోడల్ అయిన పిక్సెల్ 10, గూగుల్ అత్యంత చవకైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా రూ. 79,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది గత సంవత్సరం వచ్చిన పిక్సెల్ 9కి అప్‌డేటెడ్ వెర్షన్. అయితే, పిక్సెల్ 10లో గూగుల్ నిజంగా పెద్ద అప్‌గ్రేడ్‌లు ఇచ్చిందా? లేక చిన్న చిన్న మార్పులతో సరిపెట్టిందా? పిక్సెల్​ 9 కొనాలా? లేక పిక్సెల్​ 10 తీసుకోవాలా? ఈ రెండింటినీ పోల్చి ఇక్కడ తెలుసుకుందాము..

డిస్‌ప్లే:

పిక్సెల్ 9, పిక్సెల్ 10 రెండింటిలోనూ ఒకే రకమైన 6.3 ఇంచ్​ ఓఎల్​ఈడీ యాక్టువా డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 60-120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1080 x 2424 రిజల్యూషన్‌తో వస్...