భారతదేశం, సెప్టెంబర్ 14 -- అక్టోబర్ 31, 2026 న గురు గ్రహం సింహరాశిలోకి ప్రవేశించనుంది. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే బృహస్పతి సంచారంతో మేషం, కరక, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ దేవగురువు బృహస్పతిని జ్ఞానం, ధనం, విద్య, వివాహం, సంతానం మరియు అదృష్టానికికారకుడిగా భావిస్తారు.

అలాంటి శక్తివంతమైన గురు గ్రహం 2026 అక్టోబర్ 31వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించబోతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు కాగా, ఇది నాయకత్వం, ఆత్మవిశ్వాసం, పదవి, ప్రతిష్టలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో గురుడి రాశి మార్పు దేశవ్యాప్తంగా ఉన్న ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితంలో ఈ గోచర ...